వేసవి కాలం మొదలవ్వక ముందే చెట్లు చిగురిస్తాయి. ఆ సమయం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుడే పచ్చదనం పరుచుకుంటుంది, చెట్ల కొమ్మల మీద. అదిఎంత బాగుంటుందో చూస్తేనే తెలిసేది. రాలిపోయిన ఆకుల స్థానే కొత్త చిగురు కనిపిస్తుంది. ఆ స్థితిలో గనక మీరు పరిశీలిస్తే ప్రకృతి అందం అవగతమౌతుంది. అలాంటప్పుడు ఒక కొమ్మకి వుండే రెమ్మని తుంచి చూడండి, వసంతానికి ముందు విరిగిపోయే ఆ రెమ్మ, యిప్పుడు పచ్చగా, దృడంగా వుంటుంది. అటువంటి సమయంలో ప్రకృతి అందం మనసుని రంజింపచేస్తుంది. ఇంకొంచెం కాలం ముందుకు వెళితే విరగకాసిన పువ్వుల నవ్వులతో ఆ ప్రకృతి ఒళ్ళు విచ్చుకుంటుంది. దీన్నే మన తెలుగు భాషకి అన్వయించుకుంటే, తెలుగుకీ వస్తుందొక వసంతం, ఇది అనివార్యం. తెలుగుని పచ్చదనంతో పోల్చుకుంటే, కర్ర, జ్ఞానానికి పోలిక. జ్ఞానం గట్టిగా ఉండాలంటే మన మాతృభాషైన తెలుగులోనే తెలుసుకోవాలి. ఆ వసంతం రావాలంటే తెలుగువాళ్ళమైన మనమే పూనుకోవాలి. కాబట్టి సోదరీ సోదరులారా
" తెలుసుకోండి తెలిసి మసలుకోండి "
తెలుగు భాష తేటదనం
తెలుగు జాతి గొప్పదనం
తెలుగు యాస తియ్యదనం
తెలుసుకోండి తెలిసి మసలుకోండి
తెలుగు తల్లి లాలితనం
తెలుగు వంట కమ్మదనం
తెలుగు బిడ్డ గడుసుదనం
తెలుసుకోండి తెలిసి మసలుకోండి
తెలుగు రైతు దానగుణం
తెలుగు పిల్ల సొగసుతనం
తెలుగు ప్రజల గొంతు ఘనం
తెలుసుకోండి తెలిసి మసలుకోండి
తెలుగు వారి గాత్ర దానం
తెలుగు పద్య లక్ష్య లక్షణం
తెలుగు కవిత సొబగుదనం
తెలుసుకోండి తెలిసి మసలుకోండి
తెలుగు సిరుల దివ్యతనం
తెలుగు గిరుల ఎత్తూ బలం
తెలుగు పదాల జాగ్రుత మారుతం
తెలుసుకోండి తెలిసి మసలుకోండి
తెలుగు కథల జానతనం
తెలుగు వెతలు స్పూర్తిమంతం
తెలుగుకు లేనేలేదు అంతం గింతం
తెలుసుకోండి తెలిసి మసలుకోండి
అందుకే
తెలుగంటే అమృతం
తరాల కథా కవితల రసామృతం
తెలుగంటే విజయం
దిక్కులు పిక్కటిల్లినప్పటి భువన విజయం
Saturday, February 20, 2010
Saturday, October 10, 2009
Subscribe to:
Posts (Atom)